హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడిక్ డ్రామా సైరా ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సైరా తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళం వెర్షన్లను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చని పేర్కొంది. హిందీ వెర్షన్ త్వరలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. సురేందర్‌రెడ్డి నిర్ధేశకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేసిన సైరా పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి టైటిల్ రోల్‌లో కనిపించిన సైరాలో వీరోచిత పోరాట ఘట్టాలు మెగా అభిమానులను విశేషంగా అలరించాయి. ఇక నయనతార, సుదీప్, అమితాబ్, జగపతిబాబు, తమన్నా, విజయ్ సేతుపతి, అనుష్క వంటి దిగ్గజ నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సైరా..